రేపు దేవాలయాల పాలకమండళ్ల ప్రమాణ స్వీకారోత్సవం
– హాజరు కానున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయం, పోట్లీ మహారాజ్ దేవాలయాల పాలక మండళ్లకు రేపు ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా దేవాలయాల పాలక మండల చైర్మన్, డైరెక్టర్లను ఎన్నుకున్నారు. కాళికాదేవి దేవాలయ చైర్మన్‌గా ఆకుల రాములు, డైరెక్టర్లుగా రవీందర్, అంతారం సంతోష్ కుమార్, కావలి భద్రణ్లలతో పాటు ఆలయ ప్రధాన అర్చకులుగా విజయ్‌కుమార్ స్వామిలను ఎంపిక చేశారు. అదేవిధంగా శ్రీ పోట్లి మహారాజ్ దేవాలయ చైర్మన్‌గా నరుకుల రాజన్ గౌడ్, ప్రధాన అర్చకులుగా భట్టు స్వామి, డైరెక్టర్లుగా గజలప్ప, పట్లోళ్ల వెంకట్, యశోద, సంజయ్ జోషిలను ఎన్నుకున్నారు. శుక్రవారం మద్యాహ్నం ఆయా దేవాలయాల పాలక మండళ్ల చేత ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు హాజరు కాబోతున్నారు. మరోవైపు నామినేటేడ్ పదవుల్లో భాగంగా చైర్మన్‌లుగా ఎన్నుకోవడంపై ఆకుల రాములు, నరుకుల రాజన్ గౌడ్‌లు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

