సర్వమత సంక్షేమమే సర్కారు ధ్యేయం
– క్రిస్మన్ పండగను సంతోషంగా జరుపుకోవాలి
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– తాండూరులో అట్టహాసంగా క్రిస్మస్ విందు, దుస్తుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్వమత సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని, రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు పేర్కొన్నారు.
మంగళవారం అధికారికంగా తాండూరు పట్టణంలోని విలియమూన్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్, తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడుల ఆధ్వర్యంలో క్రైస్తవులకు విందు, కొత్త దుస్తుల పంపిణీ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెలే రోహిత్ రెడ్డిలు హాజరై సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల చేతుల మీదుగా కొత్త దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం పండగను నిర్వహించలేదని గుర్తుచేశారు. సర్వమత సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న తెలంగాణ సర్కారు క్రైస్తవుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అన్ని పండగలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ పండగలను సీఎం కేసీఆర్ సమ ప్రాధన్యతతో నిర్వహిస్తున్నారని అన్నారు. . కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పార్టీ నాయకులు, అధికారులు, క్రైస్తవులతో కలిసి క్రిస్మస్ విందును ఆరగించారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల పాసర్లు తదితరులు పాల్గొన్నారు.


