ప్ర‌భుత్వ‌ కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

తాండూరు వికారాబాద్

ప్ర‌భుత్వ‌ కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యేకు చెన్‌గెష్‌పూర్ గ్రామ‌స్తుల విన‌తి
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మండ‌లం చెన్‌గెష్ పూర్ గ్రామంలో ప్ర‌భుత్వ భూమిని దౌర్జ‌న్యంగా క‌బ్జా చేసిన వ్య‌క్తుల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి గ్రామ‌స్తులు ఫిర్యాదు చేశారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో గ్రామ‌స్తులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని క‌లిశారు. 2001లో చెన్‌గెష్‌పూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 5 ప్రభుత్వ భూమిలో అప్పటి ప్రభుత్వం నిరుపేదల కోసం 63 ప్లాట్లు అందజేశార‌ని. ఇందులో 16 మంది ఎలాంటి సర్టిఫికెట్ లేక అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ‌స్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దౌర్జ‌న్యంగా క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్న‌ వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన వారిలో ఎంపీటీసీ నరేందర్ రెడ్డి( సాయి రెడ్డి), మహిళా నాయకురాలు శకుంతల, తాండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాగపురం భీమ్ రెడ్డి, తాండూరు మండల ప్రచార కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, గ్రామస్తులు దేవేందర్ గౌడ్, బాల్రాజ్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, నరేష్ ముదిరాజ్, బంగారుగ‌ని ఎల్లప్ప ఉన్నారు.