ప‌క‌డ్బందీగా ప‌ల్లె ప్ర‌గ‌తి ప‌నులు

తాండూరు వికారాబాద్

ప‌క‌డ్బందీగా ప‌ల్లె ప్ర‌గ‌తి ప‌నులు
– న‌ర్స‌రీల‌లో మొక్క‌ల పెంప‌కంపై దృష్టి సారించాలి
– మండ‌లంలో అక‌స్మికంగా ప‌ర్య‌టించిన జిల్లా డీఆర్డీఓ పీడీ కృష్ణ‌న్
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణా ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ప‌ల్లె ప్ర‌గ‌తి ప‌నుల‌ను ప‌క‌డ్బందీగా చేప‌ట్టాల‌ని వికారాబాద్ జిల్లా డీఆర్డీఓ పీడీ కృష్ణ‌న్ అన్నారు. గురువారం తాండూరు నియోజ‌క‌ర్గంలోని పెద్దేముల్ మండ‌ల కేంద్రం, జ‌న‌గాం గ్రామాల్లో డీఆర్డీఓ పీడీ కృష్ణ‌ణ్ జిల్లా అధికారుల‌తొ క‌ల‌సి అక‌స్మికంగా ప‌ర్య‌టించారు. ఆయా ప్రాంతాల్లోని ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, న‌ర్స‌రీలలో చేప‌డ‌తున్న ప‌నుల‌ను త‌నిఖీ చేశారు. న‌ర్స‌రీల‌లో అన్ని రకాల మొక్క‌ల పెంప‌కంపై దృష్టిసారించాల‌ని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో ప‌ల్లె ప్ర‌గ‌తి ద్వార చేప‌డ‌తున్న ప‌నుల‌పై ఆరా తీశారు. గ్రామాల్లో మురుగు కాలువ‌లు లేని నివాసాల వ‌ద్ద ఇంకుడు గుంత‌లు నిర్మించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప‌ల్లె ప్ర‌గ‌తి ద్వార చేప‌ట్టే ప‌నుల‌ను ప‌క‌డ్బందీగా పూర్తి చేయాల‌న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్యయ్య‌, ఎంపీడీవో సుష్మా తదితరులు ఉన్నారు.