కొత్త మార్కెట్ యార్డు నిర్మాణానికి కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

కొత్త మార్కెట్ యార్డు నిర్మాణానికి కృషి
– 30 ఎక‌రాల‌ల విస్తీర్ణంలో ఏర్పాటు
– హ‌మాలీల‌కు ఇండ్లు, యూనిఫామ్, గుర్తింపు కార్డులు
– మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో కొత్త వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్ పేర్కొన్నారు. శ‌నివారం చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో మార్కెట్ కమిటి కార్యాల‌య సాధార‌ణ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో త్వ‌ర‌లో నూతన మార్కెట్ యార్డు ఏర్పాటుకు తీర్మానం చేసినట్లు విఠ‌ల్ నాయ‌క్ తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స‌హాకారంతో 30 ఎకరాల్లో కొత్త మార్కెట్ యార్డు నిర్మాణానికి కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇందులో ఐదు ఎకరాలు హమాలి కార్మికులకు ఇళ్లస్థలాల కోసం కేటాయించడం జ‌రుగుతుంద‌న్నారు. కొత్త మార్కెట్ యార్డులో మ‌రుగుదొడ్లు, రైతుల విశ్రాంతి గ‌దుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. హ‌మాలి కార్మికుల‌కు యూనిఫామ్‌లు, గుర్తింపు కార్డుల‌ను కూడ అంద‌జేస్తామ‌న్నారు. అదేవిధంగా ఖాంజాపూర్ లో గల ఎడ్ల బజార్ అభివృద్ధికి రూ, 10 లక్షల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు కటకం వీరేందర్, ఠాకూర్ దినేష్ సింగ్, ఆశన్న, మల్లప్ప ,భీమ్ రెడ్డి, సప్తగిరి , మార్కెట్ కమిటీ సెక్రెటరీ రాజేశ్వరి పాల్గొన్నారు.