కేసీఆర్‌పై సునీత‌మ్మ అభిమానం

తాండూరు రాజకీయం వికారాబాద్

కేసీఆర్‌పై సునీత‌మ్మ అభిమానం
– గోశాల‌లో గోవులకు పశుగ్రాసం
– వెరైటీగా సునీతారెడ్డి సేవ కార్యక్రమం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ట్ల వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి విభిన్నంగా అభిమానాన్ని చాటుకున్నారు. గురువారం జిల్లాలోని తాండూరు ప‌ట్ట‌ణంలో ఉన్న గోశాల‌ను జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి సంద‌ర్శించారు. సీఎం కేసీఆర్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని వెరైటీ సేవా కార్యక్రకం చేప‌ట్టారు. గోశాలలో 200 గోవులకు పశుగ్రాసం తినిపించి కేసీఆర్ ప‌ట్ల అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో, ప్రజాసేవ చేయాలని ప్రార్థించారు. అదేవిధంగా గోశాలకు తనవంతు సహకారం అందిస్తానని ప్రకటించారు. అనంత‌రం గోశాల అంతా క‌లియ‌తిరిగారు. ఆమె వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు నీరజా రెడ్డి, ప్రవీణ్ గౌడ్, వెంకన్న, సీనీయ‌ర్ నాయ‌కులు మ‌న్మోహ‌న్ స‌ర్డా, ర‌వీంద‌ర్, నాయకులు తదితరులు ఉన్నారు.