జ‌న గ‌ణ‌నకు వేలాయే..!

తాండూరు వికారాబాద్

జ‌న గ‌ణ‌నకు వేలాయే..!
– ప‌క‌డ్బందీగా న‌మోదు చేయాలి
– వికార‌బాద్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మోతిలాల్
– అధికారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన కేంద్ర గ‌ణ‌న అధికారి
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప‌దేళ్ల‌కోసారి చేప‌ట్టే జ‌న గ‌ణ‌న‌కు వేళ అయ్యింద‌ని, అధికారులంద‌రు స‌ర్వేకు సిద్దంగా ఉండాల‌ని వికారాబాద్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మోతిలాల్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో ఏర్పాటు చేసిన జనాభా గణన ముందస్తు సన్నాహక సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మోతిలాల్ జిల్లాలోని తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, స్టాటిస్టికల్ అధికారులతో జనాభా గణన నిర్వహణపై స‌మీక్ష జ‌రిపారు.

అనంత‌రం అయన మాట్లాడుతూ, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనాభా గణన (సెన్సెస్) కార్యక్రమం గత 2011 తరువాత ఇప్పటి వరకు నిర్వహించబడలేదని తెలిపారు. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింద‌న్నారు. 2021 కు సంభందించిన జనాభా గణన నిర్వహించాల్సి ఉందన్నారు. పాత వివ‌రాల‌తో పాటు 2014 లో తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానితో పాటు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాలు ఏర్పడినందున వాటికి అనుగుణంగా జ‌న గ‌ణ‌న చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. గతంలో నిర్వహించిన అనుభవం మేరకు నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం జనాభా గణన పూర్తి బాధ్యతతో నిర్వహించాలని అన్నారు. అధికారులు పాత అనుభవంతో పారదర్శకంగా ఏలాంటి తప్పులు దొర్లకుండా ఇన్యూమరేటర్ల ద్వారా పక్కడబందిగా పనులు చేపట్టాలని సూచించారు.
అంత‌కుముందు కేంద్ర గణన శాఖ ఉప సంచాలకులు సుబ్బరాజు జ‌న గ‌ణ‌న నిర్వహణపై తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, స్టాటిష్టికల్ అధికారులకు పవర్ ప్రెసెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో సీపీవో నిరంజన్ రావు , తాండూర్ ఆర్డిఓ అశోక్ కుమార్, కేంద్ర గణంక శాఖ జిల్లా సెన్సెస్ ఇంచార్జి అధికారి నాయుడు, అన్ని మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్ లు తదితరులు పాల్గొన్నారు.