వైభవంగా మానస పూజ
– కందనెల్లిలో ఆధ్యాత్మిక శోభ
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో మానస పూజ వేడుక వైభోగంగా జరిగింది. గ్రామంలోని హానుమాన్ దేవాలయంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ఈ వేడుకతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
మానస పూజ సందర్భంగా పెద్ద ఉమ్మెంతాల పంచమ పీఠాధిపది పూజ్యశ్రీ వేంకట దాసు హాజరై భక్తులకు ఆధ్మాత్మిక సందేశాలను ఇచ్చారు. అదేవిధంగా ఆయన ప్రవచనాలు భక్తులను మనోరంజింప జేశారు. అంతేకాకుండా వికారాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, పరిగి, సంగారెడ్డి, కోడంగల్ నుంచి వచ్చిన భజన కమిటీల బృందాలు కీర్తనలో మార్మోగించారు. శ్రీ రాకమచర్ల 108 కీర్తనలు నిర్విరామంగా ఆలాపించి మమైరిపించారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాస్ చారి, ఆలయ అధ్యక్షులు సురేందర్, మధుసూధన్ రెడ్డి, రాజేశ్వర్ రావు, కందనెల్లి భజన భక్త బృందం, యువకులు పాల్గొన్నారు.

