మహిళాభ్యున్నతే సీఎం కేసీఆర్ సర్కారు లక్ష్యం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తాండూరులో అంబరాన్నింటిన మహిళ బంధు సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహిళ అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సర్కారు ముందుకు సాగుతుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు తాండూరులో మహిళ బంధు సంబరాలను తాండూరులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఆదివారం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో పట్టణంలోని 9వ వార్డు సాయిపూర్‌లో నిర్వహించిన మహిళ బంధు వేడుకలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హనుమాన్ దేవాలయంలో పూజల అనంతరం రోహిత్ రెడ్డి సమక్షంలో పలువురు మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి మహిళ బంధు సంబరాలను ప్రారంభించారు. అదేవిధంగా వార్డులోని అంగన్‌వాడీ, ఆశవర్కర్, వీఆర్ఐ, ఆర్పీ, ఎ.ఎన్.ఎం, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి వారికి చీరలను బహుకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనే పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. మహిళల సాధికారతకు పెద్ద పీట వేసిందన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్, కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలతో మహిళలు అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. మరోవైపు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పిలుపునిచ్చిన మహిళా బంధు సంబరాల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు అవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వంచే ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, స్త్రీనిధి రుణాలు, ఒంటరి మహిళ పెన్షన్లు, ఆశ వర్కర్లకు జీతాలు పెంపు, మహిళ భద్రత కోసం షి-టీమ్స్, ఈడబ్ల్యూఎస్ కోటా కింద మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ల తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రి, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కౌన్సిలర్లు విజయదేవి, ఎర్రం వసంత, బోంబీనా, టీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు సౌజన్య, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

