ప‌ట్ట‌ణాభివృద్ధికి కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

ప‌ట్ట‌ణాభివృద్ధికి కృషి
– మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణాభివృద్ధికి కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అన్నారు. శుక్ర‌వారం తాండూరు ప‌ట్ట‌ణం 17వ వార్డులో ఆర్థిక సంఘం నిధులు రూ. 5ల‌క్ష‌ల‌తో చేప‌డుతున్న సీసీ డ్రైన్ ప‌నుల‌ను మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలుతో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ద‌శ‌ల వారిగా వార్డుల్లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అన్ని వార్డుల్లో ప‌నులు చేప‌ట్టి తాండూరును అభివృద్ధి ప‌రుస్తామ‌న్నారు. వ‌చ్చే వ‌ర్ష‌కాలంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సీసీ డ్రైన్ ప‌నులు చేడ‌ప‌తున్న‌ట్లు తెలిపారు. వివిధ వార్డుల్లో ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. ప‌నుల‌ను నాణ్య‌తంగా చేప‌ట్టాల‌ని కాంట్రాక్ట‌ర్ల‌ను ఆదేశించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ హాది, కౌన్సిలర్లు బొంబినా, వెంకన్న గౌడ్, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవ్ రావు, నాయకులు అన్వ‌ర్‌ ఖాన్, ఎర్రం శ్రీధర్, గుండప్ప, అబ్దుల్ రావుఫ్, మొయిజ్ ఖాన్, ఆర్.సంతోష్, మైనారిటీ నాయకులు, వార్డ్ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.