ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చేందుకే చ‌లివేంద్రం ఏర్పాటు

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చేందుకే చ‌లివేంద్రం ఏర్పాటు
– తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే రోగుల పాటు ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియే నిషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రి వద్ద అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో మ‌రో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే తాండూరులో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, బాటసారుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్ర‌జ‌లు చ‌లివేంద్రం ద్వార దాహ‌ర్తిని తీర్చోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో ఆహాసియేషన్ అధ్యక్షులు బాబర్, ప్రతినిధులు షల్లో, అబ్దుల్ సలీం తదితరులు పాల్గొన్నారు.