ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
– బీజేపీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వార్డు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని బీజేపీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు. శనివారం మున్సిపల్ పరిధి 20 వ వార్డులో కౌన్సిలర్ సంగీత ఠాకూర్ పర్యటించారు.
వార్డులో మురుగు ప్రాంతాల్లో దోమలు నిల్వ ఉండకుండా దోమల మందును పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కురిసిన వర్షాలతో దోమల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. దీంతో వార్డు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల మందు పిచికారి చేయడం జరిగిందని తెలిపారు.

