బాలికల సమగ్రాభివృద్ధి అందరి బాధ్యత
– చిన్నవయస్సుల్లో పెండ్లిళ్లు చేయొద్దు
– బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్
తాండూరు, దర్శిని ప్రతినిధి: బాలికల సమగ్రాభివృద్ధికి కృషి చేయడం అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ చైల్డ్ హెల్ప్ లైన్ దినోత్సవ సందర్భంగా తాండూరు పట్టణంలోని 24వ వార్డు అంగన్వాడీ సెంటర్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సాహు శ్రీలత హాజరై కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కౌన్సిలర్ సాహు శ్రీలత మాట్లాడుతూ బాలికలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. వారి సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించడం అందరి బాధ్యత అన్నారు. చిన్న వయస్సులో బాలికలకు బాల్య వివాహాల చేయడం నేరమన్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. కావున బాల్య వివాహాలను నియంత్రించాలన్నారు. బాలికలు కష్టపడి చదువుకుని తమ కాళ్లపై నిలబడాలని సూచించారు. ఈకార్యక్రమంలో సీడీపీఓ అరుణ, చైల్డ్ లైన్ ప్రతినిధి జ్యోతి, కరాటే మాస్టర్ శాంత్ కుమార్, ఆర్పీలు శ్రీదేవి, స్వప్న, అంగన్వాడీ టీచర్స్ సంగీత, భాగ్యలక్ష్మి, ఆశ వర్కర్ మల్లేశ్వరి, అంజి లమ్మ, శ్యామలమ్మ, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

