టెన్‌షన్ ఏం లేదు..!
– ప్రశాంతంగా పది పరీక్షలు
– తొలి రోజు 49 మంది గైర్హాజరు :
– అరగంట ముందే చేరుకున్న విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కరోనా మహమ్మారీ వల్ల రెండేళ్ల తరువాత నిర్వహించిన పదో తరగతి పరీక్షలు తాండూరులో ప్రశాంతంగా కొనసాగాయి. సోమవారం పదో తరగతి పరీక్షలు సజావుగా ప్రారంభం అయ్యాయి. పది పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరు పట్టణం, మండలంలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందే సూచించిన విధంగా విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు వెంట తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వచ్చి వారికి ధైర్యం చెప్పారు. నిర్ణీత సమయంలోనే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లిపోయారు.
తాండూరులో మొత్తం అన్ని కేంద్రాలలో 2306 మంది విద్యార్థులకు అలార్ట్ చేయగా 2257 మంది విద్యార్థులు హాజరు అయి పరీక్షలు రాసినట్లు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తెలిపారు. వివిధ కారణాల వల్ల 49 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. ఆలస్యంగా ఒక్కరు కూడ హాజరుకాలని తెలిపారు. దీంతో తాండూరులో ఎలాంటి టెన్షన్ లేకుండా పదో తరగతి పరీక్షలు కొనసాగాయి.

