పట్టణాభివృద్ధికి కృషి
– చైర్పర్సన్ స్వప్న పరిమళ్ గుప్తా
– 24వ వార్డులో సీసీ డ్రైన్ పనుల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త పేర్కొన్నారు. మున్సిపల్ పరిధి 24వ వార్డులో రూ. 5 లక్షలతో సీసీ డ్రైన్ పనులు చేపట్టారు. సోమవారం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుతో పాటు వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో అన్ని వార్డుల్లో నెలకొన్న సమస్యలను దశల వారిగా పరిష్కరించడం జరగుతుందన్నారు. అన్ని వార్డులలో సమస్యలు పరిష్కరించి తాండూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో్ కౌన్సిలర్ భీంసింగ్, నాయకులు, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


