ఇద్దరు కూతుళ్లతో తల్లీ అదృశ్యం
– పోలీసులను ఆశ్రయించిన భర్త
– కేసు నమోదు చేసిన కరణ్ కోట్ పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ఇద్దరు కూతుళ్లతో ఓ తల్లీ అదృశ్యమైంది. భర్తతో పాటు కుటుంభీకులు వారి ఆచూకీ కోసం గాలించిన ఫలితం లేకుండాపోయింది. చివరకు భర్త పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్లాపూర్ గ్రామానికి చెందిన అతియా పర్వీన్(26) తన ఇద్దరు కూతుళ్లు అతియా నాజ్, జోయాతసీబాన్ తో కలిసి గత ఏప్రిల్ 25న రంజాన్ పండుగతో పాటు తన తమ్ముడి పెళ్లి ఉందని కొత్లాపూర్ నుంచి పెద్ద ఐనెల్లికి భర్తతో చెప్పి బయల్దేరింది. ఆరోజు నుంచి ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబీకులు, బందువుల వద్ద విచారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భర్త ఎండి ఫాష ఆదివారం కరణ్ కోట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. వారి ఆచూకీ తెలిస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు.


