రైతుల తొలిపండ‌గ ఏరువాక పౌర్ణ‌మి

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతుల తొలిపండ‌గ ఏరువాక పౌర్ణ‌మి
– పంట‌లు సంమృద్దిగా పండాలి
– శుభాకాంక్ష‌లు తెలిపిన చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : అన్న‌దాత‌ల తొలిపండ‌గ ఏరువాక పౌర్ణ‌మి నుంచి వారి ఇండ్ల‌లో సిరులు నిండాల‌ని తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అన్నారు. మంగ‌ళ‌వారం ఏరువాక పౌర్ణ‌మి సంద‌ర్భంగా త‌న నివాసం వ‌ద్ద బ‌స‌వ‌ణ్ణ‌ల ఊరేగింపును చైర్ ప‌ర్స‌న్ ప్రారంభించారు. అంత‌కుముందు ఎద్దుల‌కు పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల‌కు తొలి పండ‌గ అయిన ఏరువాక పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ యేడాది వ‌ర్షాలు సంమృద్ధిగా కురిసి రైతుల వ్య‌వ‌సాయానికి శుభారంభం కావాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో కౌన్సిల‌ర్లు, వార్డు ప్ర‌జ‌లు పాల్గొన్నారు.