కాంగ్రెస్ నేతల దౌర్జన్యం తగదు

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ నేతల దౌర్జన్యం తగదు
– దరఖాస్తు ఫారాల పంపిణీపై ఆగ్రహం
– గాంధీ నగర్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ పథకాల అమలులో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి పాల్పడడం తగదని తాండూరు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు, గాంధీనగర్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ వార్డులో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల పంపిణీలో కాంగ్రెస్ నేతలు తమ అనుకూల వర్గాల వారికి అందజేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. అధికారుల వద్ద నుంచి ఫారాలు నేతలు లాక్కుని పంచుతున్నారని ఆరోపించారు. ప్రజల మద్య చిచ్చు పెట్టే విధంగా కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం తగదన్నారు. మా పథకాలు మా వాళ్లకే అందించాలని వ్యవహరించడం పద్దతి కాదన్నారు.

ఇలాంటి పరిణామాలతో ప్రభుత్వంపై ఆధారాభిమానాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారరులు దృష్టిసారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, పెద్దలు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం