వ‌ర్షానికి కూలిన ఇళ్లు

క్రైం తాండూరు రాజకీయం

వ‌ర్షానికి కూలిన ఇళ్లు
– నిరుపేద మ‌హిళ‌కు తీర‌ని క‌ష్టం
– తాండూరు మండ‌లం మ‌ల్కాపూర్‌లో ఘ‌ట‌న
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: భారీ వ‌ర్షానికి నిరుపేద కుటుంబానికి చెందిన ఇళ్లు కూలిపోయింది. ఈ సంఘ‌ట‌న వికారాబాద్ జిల్లా తాండూరు మండ‌లం మ‌ల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. శ‌నివారం రాత్రి నుంచి తాండూరులో భారీ వ‌ర్షం ప‌డింది. మ‌ల్కాపూర్ గ్రామానికి చెందిన మంటి చేట‌మ్మ‌కు చెందిన ఇళ్లు పూర్తిగా త‌డిసిపోయింది. గంటకు పైగా కురిసిన వ‌ర్షం కార‌ణంగా ఇళ్లు మ‌ద్య‌భాగంలోని పైక‌ప్పుకూ ఊడిప‌డింది. ఇంట్లో ఎవ్వ‌రు లేక‌పోవ‌డంతో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు. నిరుపేద కుటుంబానికి చెందిన చేట‌మ్మ ఇళ్లు కూలి పోవ‌డంతో ఆమెకు తీర‌ని న‌ష్టం జ‌రిగింది. ప్ర‌భుత్వం ప‌రిహారం అందించి ఆదుకోవాల‌ని బాధితురాలుతో పాటు ప‌లువురు గ్రామ పెద్ద‌లు కోరుతున్నారు.