బడిసేవలో లయన్స్ క్లబ్
– ఉపాధ్యాయులకు సన్మానం
– పాఠశాలకు వాటర్ ట్యాంకు వితరణ
– యాలాల జెడ్పీహైస్కూల్‌లో టీచర్స్ డే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు లయన్స్ క్లబ్ ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా బడి సేవకు కదిలింది. సోమవారం యాలాల మండలం కేంద్రంలోని జెడ్పీ బాలుర హై స్కూల్‌లో టీచర్స్ డేను ఘనంగా జరుపుకుంది. లయన్స్ క్లబ్ అధ్యక్షులు జహీర్ అహ్మద్, కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో లయన్ జూలూరీ రఘు జన్మదినం సందర్భంగా పాఠశాలలో మొక్కలు నాటారు. అదేవిధంగా కల్వ సతీష్ సహాకారంతో పాఠశాలకు వాటర్ ట్యాంకును అందజేశారు. అంతకుముందే టీచర్స్ డే సందర్భంగా పాఠశాలకు చెందిన 20 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, సర్పంచ్ సిద్రాల సులోచన, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌లు లయన్స్ క్లబ్ సేవలను కొనియాడారు. అదేవిధంగా క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జహీర్ అహ్మద్, కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్, క్లబ్ జోన్ చైర్మన్ శ్రీధర్, సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవతో పాటు విద్యాభివృద్ధికి లయన్స్ క్లబ్ తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి యూసుఫ్, సభ్యులు గోపాల కృష్ణ, పసారం బస్వరాజ్, రవీందర్ రెడ్డి, వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



