మున్సిపల్ అటెండర్ కన్నుమూత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పీహెచ్ డబ్ల్యూ అటెండర్‌గా పనిచేస్తున్న సుభూత్(42) కన్నుమూశారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. సుభూత్ మరణంపట్ల మున్సిపల్ ఉద్యోగులు విచారం వ్యక్తం చేయగా తోటి కార్మికులు, కాంట్రాక్టు సిబ్బంది శ్రద్దాంజలి ఘటించారు.
