డబుల్‌లో జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్‌లో జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి టీయూడబ్ల్యూ ఐజేయూ వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరులో జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని జర్నలిస్టు యూనియన్ టీయూడబ్ల్యూజే ఐజేయూ నేతలు విజ్ఞప్తి చేశారు. శనివారం తాండూరు పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డిల సమక్షంలో తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణల ఆధ్వర్యంలో జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. డబుల్ బెడ్ ఇండ్ల మంజూరులో జర్నలిస్టులకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

రైలు పట్టాలపై మృత్యుకేళీ..!

chaithany collage