సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– బాధిత కుటుంబానికి ఎల్ఎసీ అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : కష్ట సమయాల్లో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం అండగా నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు మున్సిపల్ పరిధి అంబేద్కర్ నగర్ కు చెందిన ఎం. మైసమ్మ అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో సీఎంఆర్ఎఫ్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వారికి ప్రభుత్వం రూ. 2లక్షల ఎల్దసిని మంజూరు చేసింది.

మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరం లాంటిందని, ఆపద సమయాల్లో అండగా నిలుస్తోందని అన్నారు. పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

స్వచ్ఛత అందరి బాధ్యత