గిరిజనుల సంక్షేమానికి సర్కారు కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

గిరిజనుల సంక్షేమానికి సర్కారు కృషి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌ రెడ్డి
– సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిలో నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: గిరిజనుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ శ్రీ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి ఉత్సవాలను తాండూరులో ఘనంగా నిర్వహించారు. ఆల్‌ ఇండియా బంజార వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధి, భూకైలాస్ వ్యవస్థాపకులు వాసు పవార్ నాయక్, పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని బాలాజీ నర్సింగ్‌ హోమ్ సమీపంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులతో కలిసి సేవాలాల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బంజారాల అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తాండాలను పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాలకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. గిరిజనులు సేవాలాల్ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.