అపూర్వం.. పూర్వవిద్యార్థులు సమ్మేళనం
– ఆర్యవైశ్యలో సందడి చేసిన వీవీహెచ్ఎస్ విద్యార్థులు
– ఉదయం నుంచి సాయంత్రం దాక జోష్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూప దృశ్యాలను పంచింది. దాదాపు 28 ఏండ్ల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మరపురాని రోజుగా జరుపుకున్నారు.
తాండూరులోని విజయ విద్యాలయ ఉన్నత పాఠశాలకు చెందిన 1994-95 పదో తరగతి బ్యాచ్‌కి చెందిన 60 మంది విద్యార్థులు ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జరుపుకున్నారు. చాలా ఏండ్ల తరువాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలను తలుచుకుని మమైరిచి పోయారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఉత్సహాంగా గడిపారు.
అదేవిధంగా అప్పుడు విద్యాబోధన చేసిన గురువులను ఘనంగా సన్మానించారు. దీంతో ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆనందాలను పంచింది.
ఇది కూడా చదవండి…

