భూకైలాస్‌ను సదర్శించిన రూరల్ సీఐ

తాండూరు రాజకీయం వికారాబాద్

భూకైలాస్‌ను సదర్శించిన రూరల్ సీఐ
– మహా శివునికి ప్రత్యేక పూజలు చేసిన అశోక్ కుమార్
– సన్మానించిన వ్యవస్థాపకులు వాసు పవార్ నాయక్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానాన్ని తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ సందర్శించారు. ఆదివారం దేవాలయంలో వెలసిన మహా శివున్ని దర్శించుకున్నారు. ఆలయ పండితుల మంత్రోచ్చరణల మద్య మహా శివునికి పూజలు నిర్వహించారు. అనంతరం మొదటి సారి భూకైలాస్ ను సందర్శించిన రూరల్ సీఐ అశోక్ కుమార్ ను దేవాలయ వ్యవస్థాపకులు వాసు పవార్ నాయక్ శాలువాతో సన్మానించారు. ప్రకృతి రమణీయత మద్య కొలువైన భూకైలాస్ దేవాలయం అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉందని రూరల్ సీఐ అశోక్ కుమార్ అనుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండా వాసులు రాము, పెద్దలు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!