కారణజన్ముడు సీఎం కేసీఆర్

తాండూరు రాజకీయం వికారాబాద్

కారణజన్ముడు సీఎం కేసీఆర్
– తాండూరు బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి
– సీఎం కేసీఆర్ కోసం నేతలతో కలిసి పూజలు, ప్రార్థనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సారధి, సీఎం కేసీఆర్ కారణజన్ముడు అని తాండూరు బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి అభివర్ణించారు.

శుక్రవారం సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయం, కోటేశ్వర దేవాలయం, హనుమాన్ టెంపుల్, నగరేశ్వర దేవాలయం, కాళికాదేవి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలతో పాటు దర్గాలలో జరిగిన ప్రార్థనల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, ఆయా దేవాలయాల చైర్మన్లు తదితరులతో కలిసి శ్రీనివాస్ చారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ చారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమించిన సీఎం కేసీఆర్ కారణజన్ముడు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రంజక పాలన చేస్తూ చిరస్మరణీయుడు అయ్యారని అన్నారు. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి దేశ గర్వించదగ్గ నాయకుడు అవుతారని, దేశానికి ప్రధాన మంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, దేవాలయాల చైర్మన్లు బంటారం సుధాకర్, సంజీవరావు, కుంచెం మురళీధర్, రాజన్ గౌడ్, నాయకులు నరేందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్‌ గౌడ్, యువనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను సమర్పించిన వారు