రైల్వే విద్యుత్ ఉప‌కేంద్రంలో మంట‌లు

క్రైం తాండూరు వికారాబాద్

రైల్వే విద్యుత్ ఉప‌కేంద్రంలో మంట‌లు
– అప్ర‌మ‌త్త‌మై ఆర్పేసిన సిబ్బంది
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు రైల్వే విద్యుత్ ఉప కేంద్రంలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. మంగ‌ళ‌వారం రాత్రి తాండూరు – హైద‌రాబాద్ రైల్వే మార్గం బ్రిలియంట్ స్కూల్ స‌మీపంలో ఉన్న ఉప‌కేంద్రంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఉప కేంద్రంలో స్పేర్‌లో ఉన్న ఓ కేపాసిట‌ర్ ప్ర‌మాద వ‌శాత్తు పేలిపోయింది. అక్క‌డే ఉన్న సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై స్థానికంగా ఉన్న అగ్ని ప్ర‌మాద నియంత్ర‌ణ ప‌రిక‌రాలతో మంట‌ల‌ను అదుపుచేశారు. దీంతో విద్యుత్ ఉప‌కేంద్రంలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.