మండపాలకు నెంబర్లు పొందాలి
– తాండూరు హిందూ ఉత్సవ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితిని పురస్కరించుకుని మండపాలను ఏర్పాటు చేసిన నిర్వహకులు నెంబర్లను తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి విజ్ఞప్తి చేసింది. శనివారం హిందూ ఉత్సవ సమిటి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిపూర్ బాల్‌రెడ్డిలు మాట్లాడుతూ రేపు అనగా ఆదివారం పట్టణంలోని తులసీ గార్డెన్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి డీఎస్పీ లక్ష్మీనారాయణ హాజరవుతున్నారని చెప్పారు. నిమజ్జన నిర్వహణతో పాటు వినాయక మండపాలకు నెంబర్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. కావున గణేష్ మండపాల అధ్యక్షులు, కార్యదర్శులు విచ్చేసి మండపాలకు నెంబరు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు బంటు మల్లప్ప ఉన్నారు.
