కాగ్నానదిలో గణేష్ నిమజ్జనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఈ సారి వినాయక నిమజ్జన ఉత్సవాలు తాండూరు కాగ్నానదిలో నిర్వహించేందుకు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత యేడాది కరోనా కారణంగా వినాయక చవితి ఉత్సవాలు చాలా నిరాడంబరంగా జరిగాయి. ఈ యేడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తులు పెద్ద ఎత్తున వినాయకులను ప్రతిష్టించారు. కాగ్నానదిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భారీగా వరధనీరు చేరింది. దీంతో కాగ్నానదిలో నిమజ్జనం నిర్వహించేందుకు హిందూ ఉత్సమి నిర్ణయించింది. తాండూరు మున్సిపల్, పోలీసు, విద్యుత్, ఫైర్ తదితర శాఖల సహాకారంతో కాగ్ననదిపై ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు మద్యాహ్నం నుంచే నిమజ్జన ఉత్సవాలను ప్రారంభించాలని సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు.
