సమీర్ ఘర్ ఆజా బెటా…!
– ఇంటి నుంచి వెళ్లిన బాలుడు అదృశ్యం
– తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు
– వెతికి పెట్టాలని తల్లిదండ్రుల ఆవేదన
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమీర్.. ఘర్ ఆజా బేటా.. అంటూ తల్లిదండ్రులు ఇంటి నుంచి అదృశ్యమైన ఓ బాలుడి కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన 14 ఏండ్ల బాలుడు అదృశ్య మయ్యాడు. ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంభీకుల కథనం మేరకు… పాత తాండూర్ కి చెందిన మొహమ్మద్ ఫెరోజ్ కొడుకు మొహమ్మద్ సమీర్(14) బుధవారం ఇంటి వద్ద ఉన్న మసీదులో నమాజ్ చదివేందుకు వెళ్లాడు.
రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. తెలిసిన వారి వద్ద, చుట్టుపక్కలా విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నేడు గురువారం మధ్యాహ్నామైన బాలుడి ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సమీర్.. జల్ది ఘర్ ఆజా బేటా అంటూ రోధిస్తున్నారు.
ఇదికూడా చదవండి…

