అర్చకుల సంక్షేమానికి సర్కారు కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

అర్చకుల సంక్షేమానికి సర్కారు కృషి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ధూప దీప నైవేద్య ఆలయాలకు ప్రొసిడింగ్స్ అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆలయ ఉద్యోగులతో పాటు అర్చకుల సంక్షేమానికి తెలంగాణ సర్కారు కృషి చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధూప దీప నైవేద్య పథకం కింద ఎంపికైన ఆలయాలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా అర్చకులకు ప్రోసీడింగ్స్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.. అదేవిధంగా ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు అర్చకుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ధూప దీప నైవేద్య పథకం కింద అర్చకులకు వేతనాలను అందిస్తోందన్నారు. ఈ పథకాన్ని అర్చకులు సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. అనంతరం అర్చకులందరు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, దేవాలయాల చైర్మన్లు, ఈఓ తాడెం నరేందర్, బ్రాహ్మణ, అర్చక సంఘం నాయకులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage