యువతకు తోడ్పాటే ధ్యేయం
– నైపుణ్యాలను వెలికి తీసేందుకు పోటీలు
– ప్రతి యేడాది క్రీడా టోర్నమెంట్లు
– క్రీడలతోపాటు విద్య, ఆరోగ్యంకు ప్రాధాన్యత
– రేపు తాండూరులో 7వేల మంది యువతతో బైక్ ర్యాలీ
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు తోడ్పాటు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇటీవల పీఎంఆర్ ట్రస్ట్, ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలో మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు బుధవారం బహుమతులు, ప్రశంస పత్రాల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలల నుంచి యువతను తరలించి తాండూరు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రేపు బుధవారం ఉదయం 11 గంటలకు రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని విలియమూన్ చౌరస్తా నుంచి దాదాపు 10 వేల మంది యువతతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. అక్కడి నుంచి ఈ ర్యాలీ ప్రభుత్వ కళాశాల మైదానం వరకు కొనసాగుతుందని వివరించారు. పీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో 225 జట్లు, 3 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీలో పెద్దేముల్ జట్టు మొదటి స్థానం, బషీరాబాద్ మండలం రెండో స్థానంలో నిలిచాయన్నారు. విజేత జట్టుకు రూ. 2 లక్షలు, రన్నర్ జట్టుకు రూ. 1 లక్ష, మండల స్థాయి, పట్టణ స్థాయిలోని విజేత జట్లకు రూ. 50 వేలు, రన్నర్ జట్టుకు రూ.25 వేలు నగదు, మిగతా వారికి ప్రశంస పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు, ఇకపై ప్రతి యేడాది ట్రస్టు ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. క్రీడలతో పాటు ఆరోగ్య శిభిరాలను నిర్వహిస్తామని, ఇందులో అవసరమైన వారికి వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామన్నారు. బషీరాబాద్ మండలం నుంచి ఆరోగ్య శిబిరాలను ప్రారంభిస్తామని చెప్పారు.
అంతేకాకుండా యువత క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు క్రీడా పోటీలను నిర్వహిస్తామని అన్నారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలలో చేయూతను అందిస్తామని పేర్కొన్నారు. యువత ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, బషీరాబాద్ జెడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, నాయకులు మసూద్, కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, ప్రవీణ్ గౌడ్, రాము, ఎంపిటీసీ శ్రీనివాస్, యువనాయకులు తాండ్ర రాకేష్, అశోక్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


