వైఓడబ్ల్యూజేయూ కొత్త కార్యవర్గం
– తాండూరు డివిజన్ కమిటి ఎన్నిక
– యూట్యూబ్, ఆన్‌లైన్ జర్నలిస్టుల పరిష్కారమే ధ్యేయం
తాండూరు, దర్శిని ప్రతినిధి: యూట్యూబ్ ఆన్‌లైన్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్(వైఓడబ్ల్యూజేయూ) తాండూరు డివిజన్ కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యింది. శుక్రవారం తాండూరులో కమిటిని ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముత్తయ్య ఆదేశాల మేరకు తాండూరు డివిజన్ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు కూర యాదయ్య సమక్షంలో తాండూరు డివిజన్ అధ్యక్షులుగా పులిమామిడి బాల్ రాజ్(తాండూరు ప్రజాపక్షం), ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి(మీటీవీ), ప్రధాన కార్యదర్శి ఠాగూర్ దీపక్ సింగ్(డీఎస్-9), కార్యదర్శిగా అఖిల్(ఎన్‌హెచ్), సంయుక్త కార్యదర్శిగా బి కృష్ణ(సమత టీవి), షబ్బీర్(ఎస్బీ-8), సలహాదారులుగా నరేందర్(ఎన్9), బాబర్(ఆశయం), ఇబ్రహీం(టీవీ న్యూస్) గణేష్(మీ న్యూస్) పి. శ్రీనివాస్(జై భీమ్ న్యూస్), సభ్యులుగా రాంభూపాల్ రావు, నరేష్, శ్రీనివాస్ గౌడ్,శ్రీనివాస్ దోమ, హరి, ప్రశాంత్, ప్రకాష్ గౌడ్, అలీం, మనోహర్, కానుక నరసింహ, ముక్తార్, వంశీ, వడ్డే శ్రీనివాస్, ఫజల్ తదితరులను ఎన్నుకున్నారు. వైఓడబ్ల్యూజేయూ యూట్యూబ్, ఆన్‌లైన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, భరోసాకు కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షులు కూర యాదయ్య అన్నారు. అదేవిధంగా వైఓడబ్ల్యూజేయూ తాండూరు డివిజన్ కమిటిని ఏర్పాటు చేయడం పట్ల నూతన కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు ముత్తయ్యకు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి…


