వీరశైవుల అభ్యున్నతికి తోడ్పాటు
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఘనంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని వీరశైవ సమాజం సభ్యుల అభ్యున్నతికి తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం చెరువెంటి ఈశ్వరాలయం సమీపంలోని వీరశైవ కళ్యాణ మండపంలో తాండూరు వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ లు హాజరయ్యారు. వారి సమక్షంలో ఎన్నికల అధికారి నారాయణ నేతృత్వంలో సమాజం నూతన గౌరవాధ్యక్షులుగా వాలి శాంతుకుమార్, అధ్యక్షులుగా ఆర్. బస్వరాజ్, ప్రధాన కార్యదర్శిగా లింగదలి రవికుమార్, సహాయ కార్యదర్శిగా అబులం సంపత్ కుమార్, కోశాధికారిగా వాలి శ్రావణ్ కుమార్ లతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులోని వీరకైన సమాజం అభివృద్ధికి గతంలో చేయూతనందించడం జరిగిందని గుర్తుచేశారు. రాసున్న రోజుల్లో కూడా సమాజం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ వీరశైవ సమాజం అభ్యున్నతికి తమవంతు సహాకారం అందించడం జరిగిందని అన్నారు. రుద్రభూమిలో సీసీ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించడం జరిగిందన్నారు. సభ్యులు కోరిన విధంగా కళ్యాణ మండపం వరకు సీసీ రోడ్డు నిర్మించేలా కృషి చేస్తామని హామి ఇచ్చారు. అదేవిధంగా బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ వీరశైవులను ఓబీసీలో చేర్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. వీరశైవులు అన్ని రంగాల్లో రాణించేందుకు ఐక్యంగా ఉండాలన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలతో పాటు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, జెడ్పీ వైస్ చైర్ పర్సన్ బైండ్ల విజయ్ కుమార్, వీరశైవ సమాజం మాజీ అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, సభ్యులు నీలకంఠ స్వామి, చంద్రశేఖర్ కిరణ్ స్వామి, అఖిల భారత వీరశైవ సమాజం అధ్యక్షులు నేతి మహేష్. ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, సిద్ధిలింగయ్య స్వామి, జొన్నల బస్వరాజ్, పటేల్ కిరణ్, తంబాకు చంద్రశేఖర్, గూలి పరమేశ్వర్, శెట్టి భాస్కర్, గాజుల శాంతుకుమార్, వీరకైన మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


