నకీలీ నోటును దాచుకున్న డాక్టర్..!
– తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టు
– నెట్టింట వైరల్ అయిన సంఘటన
దర్శిని డెస్క్: ఎవరైన మనకు నకిలీ నోట్లు ఇస్తే ఇచ్చిన వారిపై మండిపడటం సహజం. కానీ ఓ వైద్యుడు తన వద్ద చికిత్స పొందిన రోగి ట్రీట్ మెంట్ ఫీజు కింద నకిలీ నోటు ఇస్తే నవ్వుకుని భద్రంగా దాచుకున్నాడు. అంతటితో ఆగకుండా తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరాకు ఈ వింత అనుభవం ఎదురైంది. తన దగ్గరకు వచ్చిన ఒక రోగి ఫీజు కింద నకిలీ రూ.500 నోటు ఇచ్చి వెళ్లిపోయాడు. ‘‘మా రిసెప్షనిస్ట్ ఆ నోటు గమనించలేదు. అయినా వైద్యానికి వచ్చి నకిలీ నోటు ఇస్తారని ఊహించరు కదా! దాన్ని చూశాక నాకు నవ్వు ఆగలేదు. ఆ నోటును చాలా భద్రంగా దాచుకున్నా’’ అని రాసుకొచ్చారు. ఆ నోటు చూసి నవ్వుకొన్న వోరా.. అది తనకొక సరదా జ్ఞాపకంగా మారిందంటూ కొత్తగా ప్రారంభమైన థ్రెడ్స్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనికి నెటిజన్లు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.
ఇది కూడా చదవండి…


