మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
– స్వయంగా అందజేసిన చంద్రశేఖర్ గౌడ్
– కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో మృతి చెందిన రెండు కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలో అంబర్ పేట్ వెంకట్, కటై చిట్టి ఎల్లప్ప కూతురు అనారోగ్యంతో మరణించారు. బుధవారం ఈ విషయం బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ ద్వారా తెలుసుకున్న బీసీ సెల్ మండల అధ్యక్షులు ఆర్. చంద్రశేఖర్ గౌడ్ (ఆర్సీ గౌడ్) ఇద్దరు మృతుల కుటుంబాలను వేరువేరుగా పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అంత్యక్రియల నిమిత్తం రూ.4 వేల చొప్పున ఇరు కుటుంబాలకు మొత్తం రూ. 8 వేల ఆర్థిక సాయంను అందజేశారు. ఈ కార్యక్రమంలో రఘు గౌడ్, వార్డు సభ్యులు మొగులప్ప, సంజీవ్ రెడ్డి, తుల్జప్ప, జెట్టూరు గోవింద్. అల్లాపూర్ పండు, మస్తాన్, కల్లూరు తుల్జప్ప, హన్మప్ప, ఎన్. రమేష్. అల్లావుద్దీన్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage