సివిల్ ర్యాంకర్‌కు అభినందనల వెల్లువ
– మేఘనను సన్మానించిన రామకృష్ణ సేవా సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలానికి చెందిన కావలి మేఘన సివిల్స్‌లో 83వ ర్యాంకు సాధించడంపట్ల ఆమెకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. నిన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభినందించగా ఆదివారం చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సన్మానించి అభినందించారు. తాజాగా సివిల్ ర్యాంకర్ మేఘనను శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లో మేఘనను కలిసిన సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ జిల్లాకు గుర్తింపు తీసుకవచ్చిన కావలి మేఘన ఐఏఎస్‌గా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సూర్యప్రకాష్, సోషల్ వర్కర్ వెంకట్, ఉపాధ్యాయులు యూనుస్, మేఘన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
