ఆల‌స్య‌మైన విద్యార్థుల‌కు న్యాయం చేయాలి

తాండూరు వికారాబాద్

ఆల‌స్య‌మైన విద్యార్థుల‌కు న్యాయం చేయాలి
– NSUI తాండూరు నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్‌ రేడ్డి డిమాండ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఆల‌స్య‌మైన విద్యార్థుల‌కు న్యాయం చేయాల‌ని ఎన్ఎస్‌యూఐ తాండూరు నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షులు సందీప్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్ర‌వారం ప్రారంభ‌మైన ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌కు సింధు కాలేజీలో ఇద్ద‌రు, సిద్దార్థ కాలేజీ సెంట‌ర్‌లో మ‌రో విద్యార్థిని ఆల‌స్యంగా హాజ‌రు కావ‌డంతో నిర్వ‌హ‌కులు అనుమ‌తించ‌ని విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలుసుకున్న ఎన్ఎస్‌యూఐ అధ్య‌క్షులు సందీప్ కుమార్ స్పందిస్తూ విద్యార్థులను అనుమతించిన యజమాన్యం పై మరియు కళాశాలల పై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమయానికి బస్సులు లేకపోవడంతోనే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు విద్యార్థులు పరీక్ష కు అనుమతించని యజమాన్యం పై చర్యలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఆ విద్యార్థులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.