తెలంగాణ ఉద్యమానికి స్పూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ
– బీసీ సంఘం తాండూరు కన్వినర్ రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర తొలిదశ, మలిదశ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ స్పూర్తిగా నిలిచారని బీసీ సంక్షేమ సంఘం తాండూరు కన్వినర్ కందుకూరీ రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉద్యమ జీవి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్దంతిని నిర్వహించారు. రాజ్‌కుమార్‌తో పాటు పలువురు నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మూడు తరాల ఉద్యమ యోధులు 1969 నుండి 2012 వరకు నిరంతరం ప్రత్యేక తెలంగాణ పక్షాన నిలబడ్డ చరిత్ర బాపూజీది అన్నారు. 96 ఏండ్ల వయస్సులో కూడ కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారని గుర్తుచేశారు. తొలదశ, మళిదశ ఉద్యమానికి స్పూర్తి నింపారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలతో పునర్ నిర్మాణంలో అందరం భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్, తాండ్ర నరేష్, తాండూర్ పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, నాయకులు బోయ రాధాకృష్ణ, రాము ముదిరాజ్, టైలర్ రమేష్, బాబా గౌడ్, మతిన్, బసవరాజ్, అఖిల్, మాదేవ్, శ్రీనివాస్, శశి, రాజు, విద్యార్థి నాయకులు శ్రీకాంత్, వినోద్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
