బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదు..!
– హామీలు విస్మరించిన సర్కారుకు గుణపాఠమే
– తోమ్మిదేండ్ల పాలనలో ఒరిగిందేమి లేదు
– పదవుల కోసమే ఏకమైన మంత్రి, ఎమ్మెల్యే
– బళ్లారీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ యేచ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని కర్ణాటక రాష్ట్రం బళ్లారీ ఎమ్మెల్సీ సతీష్ యేచరెడ్డి విమర్శించారు. గత 8 రోజులుగా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రవాస యోజన ముగిసింది. ఈ నేపథ్యంలో శనివారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సతీష్ యేచరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శురాలు, రైల్వే పీఏసీ మెంబర్ ఉమారాణీ, నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్ రం ఇప్పటి వరకు అమలు చేయలేదన్నరు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా అమలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టిందన్నారు. రైతుబంధు, బీసీ బందు, దళితబంధు, గృహలక్ష్మీ వంటి పథకాలలో అర్హులకు అమలు చేయలేదన్నారు.
గృహలక్ష్మీ పథకానికి మూడు రోజుల గడువు ఇచ్చి.. మద్యం టెండర్లకు పక్షం రోజులు గడువు ఇవ్వడంలో తెలంగాణ చిత్తశుద్ధి అర్ధమైపోతుందన్నారు. మద్యం ఆధాయంపై పెట్టిన శ్రద్ధను సంక్షేమ, అభివృద్ధిలో చూపకపోవడం దురదృష్టకరమన్నారు. హామిలు, సంక్షేమాన్ని విస్మరించిన తెలంగాణకు గుణపాఠం తప్పదన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో 9ఏండ్లుగా ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. బైపాస్ రోడ్డు ఇంకా నిర్మాణంలోనే ఉందని, 100 మీటర్లుగా విస్తరించాల్సిన జాతీయ రోడ్డును సక్రమంగా నిర్మించలేదని విమర్శించారు. తాజాగా ఇనాళ్లు కొట్టుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు పదవుల కోసం ఒక్కటయ్యారని విమర్శించారు. కార్యకర్తలను మోసం చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీవైపు మొగ్గుచూపడం ఖాయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు సాధ్యమైనట్లే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు నరేష్ మహరాజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లేష్ యాదవ్, అసెంబ్లీ ఇంచార్జ్ రజనీకాంత్, పూజారి పాండు, మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత, కౌన్సిలర్ బాలప్ప, తాండూరు మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, బషీ రాబాద్ మండల అధ్యక్షులు గంగాదర్, నాయకులు రామ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

