చోరుడికి చేదు అనుభవం..!

క్రైం తెలంగాణ హైదరాబాద్

చోరుడికి చేదు అనుభవం..!
– కన్నం వేసిన బ్యాంకులో చిక్కని రూపాయి
– నన్ను పట్టుకోవద్దని పేపర్‌పై మేసేజ్‌
– సంచలనమైన సంఘటన
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: బ్యాంకులో కన్నం వేసిన దొంగకు భంగపాటు ఎదురైంది. చోరీకి వెళితే.. రూపాయి కూడా చిక్కలేదని చేదు అనుభవనాన్ని చవిచూశారు. దొంగతనం చేసిన బ్యాంకులో నా ఫింగర్‌ ప్రింట్‌ లేవని, తనను పట్టుకోవద్దని.. బ్యాంకు అధికారులకు, పోలీసుల కోసం పేపర్‌పై రాసి పెట్టి పరారయ్యాడు. ఈ సంఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. గురువారం మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో ఆరోజు రాత్రి చోరీ యత్నం జరిగింది. బ్యాంక్‌కు కన్నం వేస్తే భారీగా కాజేయచ్చు అనుకున్నాడో లేక ఇంకేం స్కెచ్ తో ఎంట్రీ ఇచ్చాడో కానీ మొత్తానికి‌ బ్యాంక్ లోకి దొంగతానానికి వెళ్లి భంగపాటుకు‌ గురయ్యాడు సదరు‌ దొంగ. ఎందుకంటే అతనికి బ్యాంకులో ఒక్క రూపాయి‌కూడా దొరకలేదు. మారుమూల మండలం కావడం.. చిన్న మొత్తాల పొదుపు మాత్రమే సాగుతుండటం.. నెల చివరాఖరి కావడంతో ఆ బ్యాంక్‌లో డబ్బులు లేవు. అయితే దీంతో నిరాశతో వెనదిరిగుతూ తన గ్రహపాటును వివరిస్తూ, బ్యాంక్ పని తనానికి కితాబిస్తూ ఓ న్యూస్ పేపర్ పై ఇలా రాసి వెళ్లిపోయాడు. “నాకు ఒక్క పైసా దొరక లేదు. గుడ్ బ్యాంక్ ఇది.. నన్ను పట్టుకోవద్దు.. ఫింగర్ ప్రింట్స్ దొరకవు..” అని రాసి మరీ జంప్ అయ్యాడు ఆ దొంగ.

ఉదయం బ్యాంక్ తెరిచాక అన్ని వస్తువులు చిందర వందరగా పడి ఉండటంతో దొంగలు పడ్డారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఖాకీల విచారణలో ఈ విషయం బయటపడింది. దీంతో ఈ సంఘటన వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!