అయ్యో.. అయ్యప్పా..!

క్రైం తాండూరు వికారాబాద్

అయ్యో.. అయ్యప్పా..!
– లారీ కిందపడి దుర్మరణం
– మతిస్థిమితం లేక దారుణం
తాండూరు, దర్శిని ప్రతినిధి: మతిస్థిమితం సరిగ్గాలేని ఓ వ్యక్తి లారీకింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన స్థానికులను అయ్యో పాపం అనిపించింది. ఈ దారుణ సంఘటనకు సంబంధించి తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మార్వాడి బజార్కు చెందిన పూర్ణ చంద్రరావు కుమారుడు పోతు అయ్యప్ప(40)కు గత ఆరేళ్ల నుంచి మతిస్థిమితం కోల్పోయాడు. సోమవారం మధ్యాహ్నం శివాజీ చౌరస్తా సమీపంలో గౌతాపూర్ వైపు వెళుతున్న లారీ(టీఎస్ 6 యూసీ 2058) కిందకి అయ్యప్ప దూరాడు. ఈ క్రమంలో లారీ వెనుక టైర్లు అతని కడుపుపైనుంచి దూసుకెళ్లింది. స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి . చెందినట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!