అసోసియేషన్ అభివృద్ధికి విశేష సేవలందించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

అసోసియేషన్ అభివృద్ధికి విశేష సేవలందించండి
– గ్రేన్‌ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్‌కు సన్మానం
– శుభాకాంక్షలు తెలిపిన తాండూరు వీరశైవ సమాజం నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్‌కు నతన కార్యవర్గం విశేష సేవలు అందించి ఆదర్శంగా నిలవాలని వీరశైవ సమాజం సభ్యులు ఆకాంక్షించారు. గ్రేన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను వీరశైవ సమాజం ఆధ్వర్యంలో సన్మానించారు. బుధవారం అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు వెంకట్రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి సీహెచ్ భోజిరెడ్డి, కోశాధికారి కృష్ణతో పాటు కార్యవర్గ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరశైవ సమాజం అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.బస్వరాజ్, లింగదలి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ తాండూరులోని రైతులు, వ్యాపారుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు. తాండూరు అసోసియేషన్ ప్రతిష్టను పెంచేలా పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు బంటారం సుధాకర్, సల్లా దామోదర్, దినేష్ సింగ్ ఠాకూర్, వీరశైవ సమాజం గౌరవాధ్యక్షులు వాలి శాంతు, మాజీ అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, కోశాధికారి వాలి శ్రావణ్, శెట్టి భాస్కర్, గణాపూర్ శంకర్, గంగా శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

పటేల్ కిరణ్ కుమార్‌కు సన్మానం

దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్‌ను పట్టణంలోని హేరూర్ వార్డు మఠం గల్లీకు చెందిన గుబ్బా సతీష్, మఠం నీలకంఠం స్వామి, జగదీష్, శ్రీకాంత్, లక్కాకుల హరీష్, అగ్గనూర్ సాంకేత్, సి. చంద్రశేఖర్ తదితరులు సన్మానించి.. శుభకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!