57 ఎకరాలు దేవాలయ ఆస్తులే..!
– దస్తగిరిపేట్ వెంకటేశ్వర స్వామి భూములకు రక్షణ
– సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన ఎండోమెంట్ శాఖ
– ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవు
– ఎండోమెంట్ శాఖ డిప్యూటి కలెక్టర్ అనిత
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్లోని శ్రీదేవి, భూదేవి, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం చెందిన 57 ఎకరాల భూమి ఉన్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. శుక్రవారం దేవాదాయ శాఖ అడిషనల్ కలెక్టర్ అనితతో పాటు తహసీల్దార్ సరితాదేవి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ ఇనుస్పెక్టర్ మధుబాబులు సందర్శించారు. గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాని సంబంధించి భూములు వివరాలను ఆరా తీశారు. సర్వే నెంబర్ 161, 162, 177, 179, 50లలో దేవాయానికి 57 ఎకరాల 29 గుంటలు భూమి ఉన్నట్లు గుర్తించారు.
ఈ భూములన్ని దేవాలయానికే చెందుతాయని. భూముల వివరాలతో కూడిన సూచిక బోర్డులను సంబంధించిన భూమిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అనిత మాట్లాడుతూ దేవాలయాలకు చెందిన భూములు దేవాలయాలకే చెందుతాయన్నారు. దస్తగిరిపేట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై సర్వ హక్కులు దేవాలయానికే చెందుతాయని, ఈ భూముల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరోవైపు దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, గ్రామస్తులు దేవాదాయ శాఖ కార్యాలయం చుట్టు తిరిగారు. ఈ మేరకు అధికారులు భూములను కాపాడడంపై నేతలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈఓ శేఖర్ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, గ్రామస్తులు బీజే శ్రీనివాస్, కోస్గి ఆశన్న, బోయిని అంబ్రేష్, బీజే మొగులప్ప, పెండా రజనీకాంత్, తాండ్ర స్వామిదాస్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

