బీసీల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీల ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి
– తాండూరు బీసీ బాలికల హాస్టల్‌లో జన్మదిన వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆర్.కృష్ణయ్య వారి పాలిట ఆశాజ్యోతిగా నిలుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరీ రాజ్ కుమార్ అన్నారు. బుధవారం పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య జన్మదిన వేడుకలను తాండూర్ పట్టణంలో బీసీ బాలికల హాస్టల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ విద్యార్థినిలతో కలిసి కేక్‌ కట్ చేసి ఆర్.కృష్ణయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్.కృష్ణయ్య జన్మదినం సందర్భంగా విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్ అందజేశారు. అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆర్. కృష్ణయ్య గత 50 సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకై నిరంతరం పోరాటాలు చేస్తూ ఎన్నో విజయాలు సాధించారని అన్నారు. దేశ చరిత్రలోనే బహుజనుల కొరకు పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని అన్నారు. సంక్షేమ హాస్టల్ లు గురుకుల పాఠశాలలో సన్న బియ్యం పెట్టియడంలో ఆర్ కృష్ణయ్య పాత్ర ఉందన్నారు.

అదేవిధంగా చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కావాలని నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ఆర్. కృష్ణయ్య ఆశయాలకు అందరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సుందరమ్మ, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, ప్రధాన కార్యదర్శి అనిత, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, బీసీ సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, సాయి, తాండ్ర నరేష్, పరమేష్, మథిన్, రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!