దేవీ కృప అందరిపై ఉండాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

దేవీ కృప అందరిపై ఉండాలి
– శరన్నవరాత్రులకు రూ.35 వేల సాయం
– అందజేసిన ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు, భక్తులకు దేవీ కృప మెండుగా ఉండాలని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తుల్జా భవాని నవరాత్రి ఆలయ కమిటి సభ్యులు మంగళవారం మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ను కలిశారు.

ఈ సందర్భంగా విఠల్ నాయక్ ఆలయ కమిటి సభ్యులకు శరన్నవరాత్రుల నిర్వహణ కోసం రూ. 35 వేలను సొంతంగా అందజేశారు. అనంతరం విఠల్ నాయక్ మాట్లాడుతూ శరన్నవరాత్రుల్లో దేవీ కృప అందరిపై ఉండాలన్నారు. జిల్లా ఆసుపత్రిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల, రోగుల ఆరొ గ్యాలను కాపాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ రాజు, అంజిలప్ప, శ్రీనివాస్, గోపాల్, తులసీ రాం, ప్రభాకర్, ఆశప్ప, పరేష్, జిల్ పాష తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

వ్యాపారి వద్ద నగదు సీజ్..!