కొంచెం కోతి.. కొంచెం.. మేక‌

క్రైం తాండూరు మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్

కొంచెం కోతి.. కొంచెం.. మేక‌
– వింత జంతువుకు జ‌న్మ‌నిచ్చిన మేక
– పెద్దేముల్ మండ‌లంలో ఘ‌ట‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: కొంచెం.. కోతి, కొంచెం మేక మాదిరిగా ఉన్న ఓ వింత జంతువుకు జ‌న్మ‌నిచ్చింది ఓ మేక‌. ఈ అరుదైన సంఘ‌ట‌న వికారాబాద్ జిల్లా తాండూరు నియోజ‌క‌వ‌ర్గం పెద్దేముల్ మండ‌లంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే పెద్దేముల్ మండ‌లం ఇందూరు జైరాం తాండ గ్రామానికి చెందిన పరశురామ్ నాయ‌క్ వ్యవసాయం చేసుకుంటూ నాలుగు మేకలు నడుపుకుంటున్నాడు. అయితే మంగళవారం ఉదయం ఓ మేక ప్ర‌స‌వించింది. అయితే జ‌న్మించిన మేక పిల్ల కొంచెం కోతి, కొంచెం మేక ఆకారంతో కొత్త వింత జంతువుగా జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టూ ప్రక్కల గ్రామస్తులు అట్టి జంతువును చూడటానికి బారులు తీరారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల‌ బషీరాబాద్ మండ‌లం జీవ‌న్గీలో రెండు తలాల గేదె దూడ జ‌న్మించ‌గా తాజాగా జైరం తాండాలో వింత జంతువు జ‌న్మించ‌డం రెండో సంఘ‌ట‌న‌గా జ‌రిగింది. వ‌రుస‌గా ఇలాంటి సంఘ‌ట‌న‌లు వెలుగులోకి రావ‌డం ప‌ట్ల ప్రజలు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.