తాండూరు సేవకు కృషి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు సేవకు కృషి..!
– జమాతే ఇస్లామి హింద్ మద్దతు మరువను
– కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ సేవకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని జమాతే ఇస్లామి హింద్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మనోహర్ రెడ్డికి జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షులు సయ్యద్ ముబ్బషీర్ ఆధ్వర్యంలో సభ్యులు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా సభ్యులు తాండూరులో విద్యారంగ సమస్యలు, నిరుద్యోగ యువత సమస్యలు, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలు, వైద్య సమస్యలు, ముస్లింలకు రాజకీయ సాధికారత కల్పించాలని, మరికొన్ని డిమాండ్లను మనో హర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఇందుకు మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధి సేవకు కృషి చేస్తానని అన్నారు. జమాతే ఇస్లామి హిందు సభ్యుల డిమాండ్లను నెరవేరుస్తానని అన్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వారు ఇచ్చే మద్దతు మరవలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, మసూద్, అబ్దుల్ ఖవి, వనపర్తి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాజ(పాషా (భాయి), ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఫహీం ఖాన్, అబ్దుల్ రహీం, మహమ్మద్ లయాఖ్ అలీ, అతీక్ అహమ్మద్, నజీర్ అహమ్మద్, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!