అందరు ఆశీర్వదించాలి
– తాండూరును నెంబర్ వన్గా మారుస్తా
– యువత కోసం పారిశ్రామిక హబ్ తెస్తాం
– బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలి
– కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
– అట్టహాసంగా కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళనం
– బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అందరు ఆశీర్వదించాలని ఆ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో కురుమ, యాదవ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో యాదవ, కురుమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో తిష్టవేసిన ప్రమాదకర శక్తులకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలన్నారు. జరుగుతున్న ఆరాచకానికి, వచ్చే సంక్షేమానికి జరుగుతున్న యుద్ధం అని అన్నారు. గత ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తే ఎవరికి లాభం జరిగిందో ఆలొ చించాలన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఓటు వేసిన ప్రతి ఒక్కరు గర్వపడేలా పనిచేస్తానని అన్నారు.
తాండూరును అభివృద్ధిలో, సంక్షేమంలో నెంబర్ వన్ గా నిలిచేలా కృషి చేస్తానని అన్నారు. యువతకు ఉపాధి కల్పించడం కోసం పారిశ్రామిక హబ్ను తెస్తామన్నారు. ఎన్నికల్లో అందరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలన్నారు. మరోవైపు కురుమ, యాదవ సంఘం సమ్మేళనానికి తాండూరు పట్టణం, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల నుంచి సభ్యులు, జనాలు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నిండింది.

ఈ సమ్మేళనంలో యాలాల మండలం అగ్గనూర్, తాండూరు మండలం మైసమ్మ తాండా, పెద్దేముల్ మండలం ఆత్కూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామ చేసి మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్. లైబ్రరీ మాజీ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్, మండల అధ్యక్షులు జన్నె నాగప్ప, నియోజకవర్గ కురుమ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ మండలాల సభ్యులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

